షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ
ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం
నవోదయం/షాద్ నగర్, ఆగస్టు19
షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుశీల బదిలీపై నందిగామ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కొందుర్గు ఎస్సైగా పనిచేస్తున్న రవీందర్ నాయక్ బదిలీపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. జిల్లేడు చౌదరిగూడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విజయ్ షాబాద్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. కేశంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి షాద్‌నగర్ డివిజన్ వచ్చిన తర్వాత ఒకేసారి నలుగురు ఎస్సైలు బదిలీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో పోలీసు శాఖ వర్గాల్లో ఈ బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, బదిలీ అయిన ఎస్సైల స్థానాల్లో ఎవరిని నియమిస్తారనే విషయం ఇంకా వెల్లడికాలేదు..
Telangana
షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం
Quick Summary:
షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం